పుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ ఆదివారం నుంచి ప్రారంఢం కానుంది. అయితే టోర్నీ ఆరంభానికి ముందే అభిమానులకు ఫిఫా హెచ్చరికలు జారి చేసింది. వరల్డ్ కప్ మ్యాచ్ జరిగే ఎనిమిది స్టేడియాల్లో బీరు అమ్మొద్దని ఫిఫా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
స్టేడియాల్లో బీరు అమ్మకాలకు అనుమతి ఇవ్వాలా? వద్దా అనే విషయంలో ఖతర్ , ఫిఫా మధ్య కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. మ్యాచ్‌లు జరిగే స్టేడియాల్లో బీరు అమ్మకాలపై నిషేధం విధించాలని ఖతర్ అధికారులు ఫిఫా మీద ఒత్తిడి తెచ్చారు. ఆదివారం నుంచి ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లు జరిగే స్టేడియాల వద్ద బీర్ల విక్రయాలను నిషేధిస్తూ ఖతార్ నిర్ణయం తీసుకుంది.
ఆకాశాన్నంటిన ధరలు
నవంబర్ 20 నుంచి ఫిఫా ప్రపంచకప్ పోటీలు వరుసగా 28 రోజుల పాటు జరగనున్నాయి. తొలి మ్యాచ్ ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఎనిమిది వేదికల్లో 32 జట్లు కప్పు లక్ష్యంగా పోరాడతాయి. అభిమానులు భారీగా చేరుకున్నారు. అయితే ఇక్కడ ఆహారధరల పట్టికను చూస్తే వీక్షకుల మైండ్ బ్లాక్ అవుతోంది.