Wednesday, November 20, 2024

సాగర్ బరిలో 300 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు

ఏప్రిల్ 17న జరిగే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సాగర్ ఉపఎన్నికల్లో నామినేషన్ వేయడానికి సిద్ధమైయ్యారు 300 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు.

నిడమనూరులోని ఆర్వో కార్యాలయం నుండి నామినేషన్ పత్రాలను ఫీల్డ్ అసిస్టెంట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చింతా కృపాకర్ తీసుకెళ్లారు. ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ లతో హాలియాలో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈప్రాంత 300 ఫీల్డ్ అసిస్టెంట్లతో నామినేషన్ లు వేస్తామని కృపాకర్ వెల్లడించారు. తమ సమస్యను ప్రభుత్వానికి తెలియచేయడానికే ఈ నామినేషన్లు వేస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు ఈ ఎన్నికలో పోటీ చేసేందుకు దాదాపుగా నాలుగువందల అమరవీరుల కుటుంబాలు రెడీ అవుతున్నాయి. ఇదిఇలా ఉంటే, తెలంగాణలో ఇప్పుడు అన్నీ పార్టీల దృష్టి నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక పైనే ఉంది. ఎమ్మెల్సీ విజయంతో మంచి ఊపుమీదుంది టీఆర్ఎస్.. సెట్టింగ్ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. ఇక దుబ్బాక విజయాన్ని మరోసారి పునరావృతం చేయాలని బీజేపీ ఆశిస్తోంది. కాగా ఓడిన చోటే తిరిగి జెండా పాతాలని కాంగ్రెస్ భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement