Tuesday, November 26, 2024

Fiber Net Case – చంద్ర‌బాబు ముంద‌స్తు బెయిల్ విచార‌ణ 12కి వాయిదా

అమరావతి : పైబర్ నెట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ నెల 12 కు వాయిదా వేసింది. ఈ ఫైబర్ కేసును విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేల ఎం త్రివేదిలు స్కిల్ డెవలప్ మెంట్ లో క్వాష్ పిటిషన్ తీర్పు గుర్తించి ప్రస్తావించారు. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు రాస్తున్నామని., ప్పటివరకు చంద్రబాబుపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం న్యాయమూర్తుల వ్యాఖ్యలను బట్టి డిసెంబర్ 12వ తేదీలోపు స్కిల్ కేసులో తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తోంది.


ఇదిలావుంటే ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు సన్నిహితుల ఆస్తుల జప్తుకు సిఐడి సిద్దమయ్యింది. ఇప్పటికే హోంమంత్రిత్వ శాఖ అనుమతి లభించగా ఏసిబి కోర్టు అనుమతికోసం సిఐడి ప్రయత్నిస్తోంది. మొత్తం ఏడుగురు నిందితులకు చెందిన ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ ఏసిబి కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement