హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్యను తగ్గించడంతో రోజువారీ కరోనా కేసుల్లోనూ తగ్గుదల నమోదైంది. పది రోజులుగా రాష్ట్రంలో ప్రతీ రోజూ 40వేల టెస్టులు చేస్తున్నారు. అయితే శని, ఆదివారాల్లో 24, 938 టెస్టులు మాత్రమే చేయడంతో ప్రతీ రోజూ 1000కి చేరువలో కొత్త కరోనా కేసులు … ఆదివారం కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 396 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులను కలుపుకుంటే తెలంగాణలో ఇప్పటి వరకు నమోదై న మొత్తం కరోనా కేసుల సంఖ్య 8, 25, 756కు చేరింది.
కరోనా నుంచి కోలుకోవడంతో 705 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5910 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 98శాతం మంది హోం ఐసోలేషన్ చికిత్సతతోనే కోలుకుంటున్నారు. తాజాగా 24, 938మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో 193, కరీంనగర్‌లో 19, మేడ్చల్ మల్కాజిగిరి 27, రంగారెడ్డిలో 23 అత్యధిక కేసులు నమోదయ్యాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.