Wednesday, November 20, 2024

Festival of Flower నేడు వేప‌కాయ బతుక‌మ్మ‌ వేడుకకు స‌ర్వ‌సిద్ధం

ఏడో రోజుకి చేరిన పూల పండుగ‌
గ్రామగ్రామానా ఆడ‌ప‌డుచుల సంద‌డి
నేడు వేప‌కాయాల‌ బతుక‌మ్మ‌తో ఆటా పాట

హైద‌రాబాద్ – తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. ఊరువాడలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. తెలంగాణ మహిళలు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా బతుకమ్మ సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఏడో రోజు నేడు మహిళలు వేపకాయ బతుకమ్మను సిద్ధం చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి (మంగళవారం) నాడు వేపకాయ బతుకమ్మను పేర్చుతారు. ఈరోజు బియ్యప్పిండి వేయించి, బెల్లం వేసి, వేపపువ్వు ఆకారంలో చేసిన వంటకాన్ని గౌరమ్మకు నివేదిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఈరోజు వేపకాయ బతుకమ్మ అని పేరు వచ్చింది. చామంతి, గునుగు, రుద్రాక్ష తదితర పూలను ఏడు ఎత్తుల వరకు పేర్చి వాటిపై గౌరమ్మను పెడతారు. వేపచెట్టు అంటే ఆదిదేవత యొక్క నిజమైన ప్రతిరూపం. అలాంటి ఆదిపరాశక్తిని పూజిస్తూ మహిళలు వేపకాయల బతుకమ్మను పూజిస్తారు. సకినాలు చేసిన పిండితో నైవేద్యాన్ని సమర్పిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement