Sunday, November 24, 2024

Festival Bonanza – ధన్‌తేరస్, దీపావళి ఎఫెక్ట్​ – గోల్డ్​ సేల్స్​ అదుర్స్​

రూ. 20 వేల కోట్ల విలువైన బంగారం అమ్మ‌కాలు
ధన్‌తేరస్, దీపావళి ఎఫెక్ట్​
బులియన్ మార్కెట్ జోరు
ఏకంగా 25 టన్నుల గోల్డ్ విక్ర‌యం
250 ట‌న్నుల వెండి కొనుగోలు
దీని మార్కెట్ విలువ 2500 కోట్లు
రూ.4.25 ల‌క్ష‌ల కోట్ల ట‌పాసుల అమ్మ‌కాలు
వోక‌ల్ ఫ‌ర్ లోక‌ల్ నినాదం
జోరు త‌గ్గిన చైనా ట‌పాసులు
మ‌ట్టి దీపాల‌కు య‌మ డిమాండ్

ఆంధ్రప్రభ స్మార్ట్​, న్యూఢిల్లీ : ధన్‌తేరస్ , దీపావ‌ళి పండుగ‌ సంద‌ర్భంగా దేశవ్యాప్తంగా బంగారు అమ్మ‌కాలు జోరుగా సాగాయి. బులియ‌న్ మార్కెట్ నివేదిక ప్ర‌కారం సుమారు రూ. 20వేల‌ కోట్ల విలువైన బంగారం, రూ. 2,500 కోట్ల విలువైన వెండి అమ్మ‌కాలు జ‌రిగాయి. ఈ ఏడాది ధన్‌తేరస్ లో బంగారం, వెండి విక్రయాలు పెరిగాయి. దేశంలో దాదాపు నాలుగు లక్షల మంది చిన్నా పెద్దా నగల వ్యాపారుల నుంచి భారీగానే కొనుగోళ్లు జ‌రిగిన‌ట్లు అంచ‌నా.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌లో నమోదైన దాదాపు 2 లక్షల మంది నగల వ్యాపారులు నిన్న 25 టన్నుల బంగారాన్ని విక్రయించార‌ని సమాచారం… అదేవిధంగా దేశవ్యాప్తంగా 250 టన్నుల వెండి విక్రయాలు జ‌రిగాయి.

- Advertisement -

గ‌త‌ఏడాది కంటే రూ.20 వేలు పెరిగిన గోల్డ్ రేట్
గతేడాది ధన్‌తేరస్‌ సందర్భంగా 10 గ్రాముల బంగారం ధర రూ.60 వేలు పలికింది. ఈ ఏడాది రూ.81,211కి పెరిగింది. అదేవిధంగా గతేడాది వెండి ధర కిలో రూ.70 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.లక్షకు చేరుకుంది. అందువల్ల, బరువులో అమ్మకాలు క్షీణించినప్పటికీ, కరెన్సీ పరంగా అమ్మకాలు పెరిగాయి.

గ్రీన్ టపాసుల‌కు డిమాండ్


దీపావళి సందర్భంగా దేశ వ్యాప్తంగా ట‌పాసుల అమ్మ‌కాలు జోరందుకున్నాయి. ఈ సీజ‌న్ లో ప్ర‌స్తుతం జోరును బ‌ట్టి ఏకంగా 4.25 ల‌క్ష‌ల కోట్ల బాణ‌సంచా అమ్మ‌కాలు కొన‌సాగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. “వోకల్ ఫర్ లోకల్” అనే ఫిలాసఫీ మార్కెట్‌లలో కనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో కొనుగోళ్లన్నీ దాదాపు భారతీయ వస్తువులే. దీపావళికి సంబంధించి చైనా వస్తువులను విక్రయించకపోవడం వల్ల దాదాపు రూ.1 లక్షా 25 వేల కోట్ల వ్యాపారంలో చైనా నష్టపోతోందని ఓ అంచనా.

మ‌ట్టి దీపాల‌కు య‌మ గిరాకీ


ఈ ఏడాది మట్టి దీపాలకు మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. స్థానిక స్థాయిలో రూ.10కి 12 మట్టి దీపాలు, రూ.20కి 25 మట్టి దీపాలు చిల్లరగా లభిస్తున్నాయి. ఒక పెద్ద దీపం 10 రూపాయలకు లభిస్తుంది. దీంతో ప్ర‌జ‌లు వాటినే కొంటున్నారు. ఆలాగే హ‌స్త క‌ళాకారులు చేతితో రూపుదిద్దుకున్న దీపాలు, బొమ్మలు, అలంకరణ వస్తువుల అమ్మ‌కాలు కూడా భారీగా సాగుతున్నాయి. కాగా, చైనాకు చెందిన విద్యుత్ దీపాల అలంకార‌ణ వ‌స్తువులు వంద లోపుకే అందుబాటులో ఉండ‌టంతో వాటిపై కూడా అస‌క్తిక‌న‌బరుస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement