Friday, November 22, 2024

Egypt : ఈజిప్టు నైలు నదిలో ఫెర్రీ బోటు బోల్తా ….19 మంది మృతి…

ఈజిప్టులో ఘోర బోటు ప్రమాదం చోటుచేసుకుంది. ఈజిప్టు రాజధాని కైరో శివారులో నైలు నదిలో ఓ ఫెర్రీ బోటు మునిగిపోవడంతో 19 మంది కూలీలు మృతి చెందారు. గ్రేటర్‌ కైరోలో భాగమైన గిజాలోని మోన్షాత్‌ ఎల్‌ కాంటేర్‌ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది.

పడవలో ప్రయాణిస్తున్న వారంతా దినసరి కూలిలుగా అక్కడి అధికారులు గుర్తించారు. ఈ కూలీలంతా ఓ నిర్మాణ సైట్‌లో పనికి వెళ్తుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పడవ ప్రమాదానికి కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల ఈజిప్టియన్‌ పౌండ్లు, గాయపడ్డ ఐదుగురికి 20 వేల పౌండ్ల నష్టపరిహారాన్ని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

- Advertisement -

ఇక, అప్పర్‌ ఈజిప్ట్‌లోని నైలు నది డెల్టాలో ప్రజలు ఎక్కువగా తమ రోజువారి పనుల కోసం ఫెర్రీ బోట్లలోనే ప్రయాణాలు చేస్తుంటారు. నిర్వహణా లోపాల వల్ల ఈజిప్టులో రోడ్డు, రైలు, బోటు ప్రమాదాలు తరచుగా జరుగుతునే ఉంటాయి. గతంలో జరిగిన బోటు ప్రమాదాల్లోనూ నైలు నదిలో మునిగిపోయి చాలా మంది చనిపోయారని అనేక గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement