న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉన్నత విద్యకు అన్ని రకాల ఫెలోషిప్‌లను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఫెలోషిప్ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలంటూ రీసెర్చ్ స్కాలర్స్ ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రం యూనివర్సిటీ ఫెలోషిప్‌లను పెండింగ్‌లో పెట్టిందని, విద్యా వ్యవస్థను ప్రయివేటీకరణ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని బుధవారం అసోసియేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నాలుగురోజులుగా కేంద్రమంత్రులను, అధికార పార్టీ ఎంపీలను, ప్రతిపక్షాల ఎంపీలను, యుజీసీ చైర్మన్లను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశామన్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రోత్సాహo ఇవ్వాల్సింది పోయి నెడుతున్నారని, అందుకే ఛల్లీ ఢిల్లీ పేరుతో పోరాడుతున్నామని రీసెర్చ్ స్కాలర్స్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..