Monday, November 18, 2024

అంతా మా ఇష్టం.. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల వెూత..

(ప్రభన్యూస్‌ ప్రతినిధి, మేడ్చల్‌): జ్వరం లేదా ఏదైన రోగంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరితే ఆసుపత్రుల యాజమాన్యాలు టెస్టులు, బెడ్‌ చార్జీ, మేడిసన్‌ పేరుతో సుమారు రూ.85 వేల నుంచి రూ.1 లక్ష రూ.20వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్లు రోగుల బందువులు చెబుతున్నారు. చిన్న రోగాలకే లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రోగుల బందువులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌ఎంపీలకు కమీషన్‌..

నగరానికి ఆనుకొని ఉన్న మేడ్చల్‌, శామీర్‌పేట, మూడుచింతలపల్లి, కీసర, ఘట్‌కేసర్‌ లాంటి రూరల్‌ మండలాల ప్రజలు చిన్న రోగం వచ్చిన ఆర్‌ఎంపీలను ఆశ్రహిస్తారు. సాధారణ జ్వరాలు, ఇతర సాధారణ జబ్బులకు స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీలే వారికి దిక్కువుతున్నారు. వివిద రకాల విష జ్వరాలతో పాటు ఇతర తీవ్ర వ్యాధులతో బాద పడే రోగులను కొంత మంది ఆర్‌ఎంపీ వైద్యులు తమకు సంబంధం ఉన్న ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలని రోగులకు సూచనలు చేస్తూ స్వయంగా ఆర్‌ఎంపీలు ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకు పోతుంంటారు. ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు పోయిన ఆర్‌ఎంపీ వైద్యులకు సుమారు 30 శాతం కమీషన్‌ రూపంలో ప్రైవేటు ఆసుపత్రులు ముట్ట జెప్పుతున్నాయనే ఆరోపనలు జోరుగా వినిపిస్తున్నాయి. నగరంలోని ప్రధాన ప్రైటు ఆసుపత్రులతో జిల్లాలోని ఆర్‌ఎంపీలందరికి అవగాహణ ఉంటుంది. ప్రస్తుతం జిల్లా ప్రాంతంలోని అర్బన్‌ కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రులు గ్రామీన ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీ వైద్యులతో ఈ రకమైన అవగాహణ కుదుర్చుకొని రోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు.

నిబంధనలు కాన రావు..

నగరంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏ పరీక్షకు ఎంత ధర అనేది విధిగా బోర్డుపై ఉండాలి. ఇన్‌ పేషెంట్‌.. అవుట్‌ పేషెంట్‌ వివరాలు కూడా ఆన్‌లైన్‌ ద్వారా జిల్లా వైద్యాధికారకి పంపించాలి. కానీ ఇవన్ని మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లాలో కనిపించడం లేదు. ఇది ఇలా ఉంటే గతంలో ఉన్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు మాత్రం వీటిన కనీసం తనిఖీలు చేయలేదు. ఈ తతంగం గమనించిన ప్రస్తుతం జిల్లా వైద్యాధికారిగా బాద్యతుల తీసుకున్న పుట్ల శ్రీనివాస్‌ ప్రతి రోజు ఏదో ఒక ప్రభుత్వ సెంటర్‌ను తనిఖీలు చేస్తూ వైద్యులను అప్రమత్తం చేస్తున్నాడు. జిల్లా వైద్యాధికారులు ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీలు ఎప్పుడు చేపడుతాడని తీవ్రంగా డబ్బులు చెల్లించిన రోగుల బందులు పేర్కొంటున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement