పృథ్వీ అంబర్, సుమయా రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘డియర్ ఉమ’. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వంలో సుమయా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ సినిమా ప్రారంబోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. రచయిత, నిర్మాత కోన వెంకట్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయిరాజేష్ మహాదేవ్ మాట్లాడుతూ ” ‘డియర్ ఉమ’ అనేది ఓ బాధ్యత గల చిత్రం.
మా హీరోయిన్, నిర్మాత అయిన సుమయా రెడ్డి గారు కథ రాసి వినిపించారు. మంచి టీమ్ కుదిరింది. రాజ్ తోట, రధన్, రామాంజనేయులు వంటి వారు టెక్నీషియన్స్‌గా పని చేస్తున్నారు. మా హీరోయినే నిర్మాతగా మారాలని ముందే అనుకునే ట్రావెల్ స్టార్ట్ చేశాం. అందరూ సపోర్ట్ అందిస్తారని భావిస్తున్నాను. కథపై నమ్మకంతోనే పాన్ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రతి వ్యక్తి జీవితంలో ఓ ఎలిమెంట్ కథలో ఉంటుంది. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం” అన్నారు.
నిర్మాత, హీరోయిన్ సుమయా రెడ్డి మాట్లాడుతూ, ”కథ నేను రాసినప్పటికీ నా టీమ్‌తో కలిసి డెవలప్ చేశాను. మేం కథపై నమ్మకంతో బాధ్యతగా తీసుకుని హీరోయిన్‌గా, నిర్మాతగా సినిమా చేస్తున్నాను. ప్రతి ఒక ఇంట్లో జరిగిన, జరుగుతున్న కథ. అందరూ కనెక్ట్ అవుతారు” అన్నారు. హీరో పృథ్వీ అంబర్ మాట్లాడుతూ ”నేను ముందుగా దియా అనే కన్నడ చిత్రంలో నటించాను. తెలుగులోనూ అనువాదమై మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు డియర్ ఉమ వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. డియర్ ఉమ కథ చాలా బావుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరి. మంచి మెసేజ్ ఉంటుంది. అందరికీ థాంక్స్” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఇతర టీమ్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.