ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లోనే అన్ని రకాల లావాదేవీలు జరుగుతున్నా, పూర్తిగా డిజిటల్ పేమెంట్స్ అమల్లోకి వచ్చినా కొన్ని సందర్భాల్లో బ్యాంకు శాఖలకు వెళ్లాల్సి రావచ్చు. ఇప్పుడు టైం కూడా చాలా కీలకం కూడా. కనుక మనం బ్యాంకు శాఖకు వెళ్లాలనుకున్న వారు ఆ రోజు సెలవు ఉందా ? లేదా.. ? అన్న సంగతి తెలుసుకుంటే తేలిగ్గా ఉంటుంది. మరో రెండు రోజుల్లో 2024లో రెండో నెల ఫిబ్రవరి ప్రారంభం కాబోతున్నది. రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో కలిపి ఫిబ్రవరిలో మొత్తం బ్యాంకులకు 11 రోజులు సెలవులు ఉన్నాయి.
ఫిబ్రవరిలో బ్యాంకు సెలవులివే..
ఫిబ్రవరి 4 – ఆదివారం
ఫిబ్రవరి 10- రెండో శనివారం
ఫిబ్రవరి 11 – ఆదివారం
ఫిబ్రవరి 14 – వసంత పంచమి, సరస్వతి పూజ
ఫిబ్రవరి 15 – లుయి గాయి నీ … ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు
ఫిబ్రవరి 18 – ఆదివారం
ఫిబ్రవరి 19- ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి – బెలాపూర్, ముంబై, నాగ్పూర్ల్లో సెలవు
ఫిబ్రవరి 20- రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్, ఇటా నగర్ ల్లో బ్యాంకుల మూసివేత.
ఫిబ్రవరి 24- నాలుగో శనివారం
ఫిబ్రవరి 25- ఆదివారం
ఫిబ్రవరి 26 – న్యోకూమ్ – ఇటా నగర్లో బ్యాంకులకు సెలవు.