Tuesday, November 26, 2024

బ్రహ్మస్త్రకు బాయ్​కాట్​ భయం.. హైదరాబాద్​లో ప్రి రిలీజ్​ ఈవెంట్​ రద్దు!

బాయ్‌కాట్ ట్రెండ్‌తో బాలీవుడ్ బ‌లవుతున్న విషయం తెలిసిందే. దీని ప్రభావం పడి ఇప్పటికే స్టార్ హీరోలు ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’ సినిమాలు బాక్స్ ఆఫీస్ వ‌ద్ద ప్లాప్స్ గా మిగిలిపోయాయి. పెట్టిన పెట్టుబడిలో సగం కలెక్షన్లను కూడా రాబట్టలేని స్థితికి వెళ్లిపోయాయి. ఇప్పుడు బాలీవుడ్ నుంచి మరో భారీ బడ్జెట్ మూవీ ‘బ్రహ్మస్త్ర’ ని కూడా ఈ బాయ్‌కాట్ ట్రెండ్ వెంటాడుతోంది. ఈ సినిమాలోని హీరో హీరోయిన్లు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ స్టార్ కిడ్స్ కావడం.. నచ్చకపోతే సినిమా చూడకండి అని ఆలియా పొగరుగా మాట్లాడడం.. నెపోటిజాన్ని ఎంకరేజ్ చేసే కరణ్ జోహార్ నిర్మాత కావడంతో ఈ సినిమాని కూడా బాయ్‌కాట్ చేయాలని ట్రెండ్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

బ్రహ్మస్త్ర సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతోన్ననేపధ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇవ్వాల (శుక్రవారం) ప్రీ రిలీజ్ వేడుకను తొలుత హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించేందుకు భారీగా ప్లాన్ చేశారు. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరు కాబోతున్నట్లుగా చిత్రయూనిట్ మొదటి నుంచి హైలెట్ చేస్తూ వస్తుంది. కాగా, చివరి నిమిషంలో ఈ ప్రీ రిలీజ్ వేడుక ఆగిపోయింది. పోలీసులు అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది.

ఈ విషయాన్ని చిత్రం పీఆర్వో అధికారికంగా ప్రకటించారు. దీంతో తారక్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతూ.. ట్విట్టర్ వేదికగా చిత్ర యూనిట్‌పై ఫైర్ అవుతున్నారు. ఇక.. హైదరాబాద్​లోని పార్క్​ హయత్​లో ప్రెస్​మీట్​ పెట్టాలని సినిమా యూనిట్​ ప్లాన్​ చేసినట్టు తెలుస్తోంది. కార్యక్రమంలో ప్రీ రిలీజ్ వేడుక క్యాన్సిల్ కావడానికి కారణం తెలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. పార్క్ హయాత్‌‌తో జరిగే మీడియా సమావేశానికి తారక్ కూడా హాజరవుతున్నట్లు ఫిలింనగర్​ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement