Wednesday, November 20, 2024

సరదాకి డీఎన్ఏ టెస్టు చేయించిన తండ్రి..విషయం తెలిసి షాక్

అమెరికాలో సొంత కొడుకుకి వినోదం డీఎన్ఏ టెస్ట్ చేయించిన ఓ తండ్రికి దిమ్మతిరిగే నిజం తెలిసింది. కుమారుడి డీఎన్ఏ తనకు మ్యాచ్ కాకపోవడంతో వన్నెర్ జాన్సన్ కంగుతిన్నాడు. అమెరికాలోని ఉటా ప్రాంతానికి చెందిన డోనా, వన్నెర్ జాన్సన్ దంపతులకు ఊహించని అనుభవం ఎదురయ్యింది. ఇద్దరు కుమారుల తండ్రి అయిన వన్నెర్ జాన్సన్ 12 ఏళ్ల  తరువాత వినోదం కోసం తన రెండవ కుమారునికి డిఎన్ఏ టెస్టు చేయించాడు. ఎంతో ఆతృతతో రిపోర్టును చూసిన ఆ తండ్రి గుడ్లు తేలేసి, చెమటలు కక్కాడు. రిపోర్టులో ఆ బాలుడు వారి కన్నకుమారుడు కాదని తేలింది.

ఐవీఎఫ్‌ సమయంలో ఫ్యూజన్‌(కలయిక)లో పొరపాటు చోటుచేసుకున్న కారణంగా ఈ సమస్య తలెత్తింది. వివరాల్లోకి వెళితే డోనా, వన్నెర్ జాన్సన్ దంపతులు రెండవ సంతానం కోసం 2007లో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) అంటే కృత్రిక గర్భధారణ విధానాన్ని ఆశ్రయించారు. ఐవీఎఫ్ విధానంలో డోనా గర్భం దాల్చి కుమారునికి జన్మనిచ్చింది. ఇద్దరు పిల్లలతో ఆ దంపతుల జీవితం హాయిగా సాగుతూ వచ్చింది. 12 ఏళ్ల తరువాత వన్నెర్ జాన్సన్ తన రెండవ కుమారునికి డీఎన్ఏ టెస్టు చేయించాడు. అంతే … ఆ దంపతుల ఆనందం అంతా ఆవిరైపోయింది. ఈ రిపోర్టు చూసిన వన్నెర్ జాన్సర్ తన భార్యకు ఐవీఎఫ్ చికిత్స అందించిన క్లినిక్‌పై కేసు వేశారు. వన్నెర్ జాన్సన్ తీసుకున్న రిపోర్టులో తన రెండవ కుమారుని తల్లి పేరు డోనా అని ఉండగా, తండ్రి ఎవరో తెలియదంటూ ఉంది. దీనిపై దర్యాప్తు చేపట్టగా, ఒక ఫ్యూజన్‌లో పొరపాటు చోటు చేసుకున్నదని తేలింది. డోనాకు సంబంధించిన అండం వేరొకరి వీర్యంతో ఫ్యూజన్ అయ్యిందని తేలింది. ఫలితంగా ఈ సమస్య తలెత్తిందని వెల్లడయ్యింది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో పెరిగిన బిర్యానీ ధరలు!

Advertisement

తాజా వార్తలు

Advertisement