కూతురును స్కూల్‌కు తీసుకెళ్లేందుకు తండ్రి ఎలక్ట్రిక్ బైక్ కొన్నాడు. కొన్ని వారం కూడా కాలేదు.. ఆ బైకే తండ్రి కూతురు ప్రాణాలు తీసింది. ఈ ఘటన తమిళనాడులోని వేలూరు చిన్న అల్లాపురంలో చోటు చేసుకుంది. కూతురు ప్రీతి కోసం సౌకర్యవంతంగా ఉంటుందని ఎంతో ఆలోచించి తండ్రి దురై వర్మ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశాడు. కూతురిని స్కూల్‌కు తీసుకెళ్లేందుకు కష్టాలు తీరిపోయానుకున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఛార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. చార్జింగ్ కోసం బైక్‌ను ఇంట్లోనే పెట్టిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాటరీ పేలడంతో.. ఇళ్లంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ఇద్దరూ ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు. వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్ అయిన 49 ఏళ్ల దురై కూతురు ప్రీతి.. తిరువన్నమలై ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటుంది.
రెండు రోజుల క్రితమే ఈ బైక్‌ను కొనుగోలు చేశాడు. ఒక్కసారిగా పేలడంతో పక్కన ఉన్న రెండు వాహనాలకు నిప్పు అంటుకుంది. దీంతో తండ్రి కూతురు బాత్‌రూంలో వెళ్లి డోర్ వేసుకోగా.. ఇళ్లంతా పొగ వ్యాపించడంతో చివరికి ప్రాణాలు కోల్పోయారు. ఎలక్ట్రిక్ బైక్ కావడంతో చాలా మందికి చార్జింగ్‌పై అవగాహన ఉండటం లేదు. ఎంత సేపు చార్జింగ్ పెట్టాలి.. ఎప్పుడు పెట్టాలి.. ఎక్కడ పెట్టాలి అన్నదానిపై కంపెనీల నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు విమర్శిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి...