ఘోర రోడ్డుప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన గుజరాత్ రాష్ట్రంలో భావ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. త్రపాజ్ గ్రామ శివారులో ఇవాళ ఉదయం ప్రైవేటు బస్సు- ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు భావ్‌నగర్ నుంచి మాహువ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో పోలీసులు వాహనాలను పక్కకు తొలగించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -