ఘో రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలైన విషాద ఘటన మహారాష్ట్రలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రయాణికులతో వెళ్తున్న మాక్సిమో వాహనాన్ని వెనుక నుంచి అతివేగంతో వచ్చిన ఐచర్ వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో మాక్సిమో వాహనం ముందు ఉన్న బస్సును ఢీకొట్టడంతో నుజ్జునుజ్జైంది.
ఈ దుర్ఘటనలో మాక్సిమో వాహనంలో ఉన్న తొమ్మిది మంది తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే, పూణే సమీపంలోని నారాయణ్ గావ్ సమీపంలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.
- Advertisement -