సంగారెడ్డి జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న బొలెరో, ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. గురువారం ఉదయం ఆందోల్ మండలం కన్సాన్‌పల్లి వద్ద నాందేడ్ – అకొలా జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు – కారు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అయితే చలితీవ్రత పెరిగిపోయింది. దీనికి తోడు పొగమంచు కూడా కమ్మేయడంతో రోడ్డు పూర్తిగా కనిపించడం లేదు. ఇదే కారణమని పలువురు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చిన్నారి కాంక్షితో పాటు డ్రైవర్ దిలిప్, వినోద, సుప్రసిత ప్రమాదంలో మృతి చెందగా.. హైదరాబాద్‌లోని జీడిమెట్ల వాసులుగా గుర్తించారు. బస్ రాంగ్‌రూట్‌లో రావడం.. పొగమంచుకారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో బస్సు – కారు ఢీకొట్టుకున్నట్లు తెలుస్తున్నది.
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..
Advertisement
తాజా వార్తలు
Advertisement