Friday, January 10, 2025

Jadcherla | ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న బ‌స్సు

  • ముగ్గురు మృతి, ప‌లువురికి గాయాలు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తుండ‌గా.. ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొంది. బస్సు హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలింస్తున్నారు. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement