Monday, December 2, 2024

TG | ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి

మెదక్ : జిల్లాలోని మనోహరాబాద్‌ మండలం పోతారం వద్ద శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. బైక్, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

పోతారం గ్రామానికి చెందిన మన్నె ఆంజనేయులు అనే వ్యక్తి తన మరదలు లత, ఆమె ఇద్దరు పిల్లలు సహస్ర, సాన్విలతో కలిసి బైకుపై శ‌భాష్ పల్లి వైపు వెళ్తుండగా.. ఎదురుగా వ‌చ్చిన‌ ట్రాక్టర్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లత, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెండ‌గా.. ఆంజనేయులు చికిత్స పొందుతూ మృతి చెందాడు.

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement