Tuesday, November 19, 2024

Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం – 10మంది మృతి

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. రుద్రప్రయాగ్ జిల్లాలో రిషికేశ్-బద్రీనాథ్ హైవే దారిలో 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ వాహనం అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. గ్రామస్తులు పోలీసులు, పరిపాలనా అధికారులు, డీడీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. టెంపో నుంచి క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చి, హెలికాప్టర్‌ ద్వారా గుప్తకాశీలోని ఆస్పత్రికి తరలించారు.

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ ధామి ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, పరిపాలనా అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనపై ఆయన ఒక ట్వీట్‌లో విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రమాదంపై విచారణకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్థారణ అయితే అతనిపై కఠిన చర్యలు ఉంటాయని సిఎం హెచ్చరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement