ఛత్తీస్‌గఢ్ : ముంగేలి జిల్లా సర్గావ్ పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. ఐరన్ తయారీ కంపెనీలో సైలో స్ట్రక్చర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పనిచేస్తున్న దాదాపు 30 మంది కూలీలు చిమ్నీ కింద చిక్కుకోగా… అందులో నలుగురు కూలీలు చనిపోయినట్టు తెలుస్తొంది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌లు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన కార్మికుడిని సైలో స్ట్రక్చర్ కింద నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మిగిలిన కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.