రన్నరప్ లుగా మహరాష్ట్ర, గుజరాత్ భామలు ..
ముంబయి – ఈ ఏడాది ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని నిఖిత పోర్వాల్ సొంతం చేసుకుంది. ముంబయిలోని ఫేమస్ స్టూడియోస్‌లో జరిగిన ఈవెంట్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన నిఖిత విజయం సాధించింది. మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. రేఖా పాండే, ఆయుశీ దోలకియా మొదటి, రెండవ రన్నరప్‌లుగా నిలిచారు.
60వ ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో భాగంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన అందాల భామలు పోటీపడ్డారు. కేవలం తమ అందాలతోనే కాదు, ప్రతిభతోనూ జడ్జిల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తుది పోరులో అదరగొట్టిన నిఖిత పోర్వాల్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. టైటిల్ గెలిచిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఉజ్జయినికి చెందిన నిఖిత తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. గతేడాది మిస్ ఇండియాగా నిలిచిన నందినిగుప్తా విజేతకు కిరీటాన్ని అలంకరించారు. ఇక, రన్నరప్‌లు రేఖ స్వస్థలం దాద్రా అండ్ నగర్ హవేలీ కాగా.. ఆయుశీది గుజరాత్.