Saturday, November 23, 2024

NIFT | ఫ్యాషన్ డిజైనింగ్ & టెక్నాలజీ పరీక్ష ఫలితాలు విడుదల..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా 60 నగరాల్లోని 72 కేంద్రాల్లో ఫిబ్రవరి 5న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసిన ఎన్టీఏ.. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు అభ్యంతరాలు స్వీకరించగా.. అభ్యంతరాలను పరిశీలించిన ఎన్టీఏ తుది సమాధాన కీతోపాటు తాజా ఫలితాలను ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement