గొల్లపల్లి, (ప్రభన్యూస్): రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో సర్పంచ్ కందుకూరి సత్తయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వరినాట్ల సంబరాల కార్యక్రమంలో మంత్రి కొప్పుల పాల్గొన్నారు. ఈసందర్భంగా రైతుగా మారిన కొప్పుల నాగలి పట్టి పొలంలో దున్నిన అనంతరం మహిలా రైతులతో కలిసి వరినాట్లు వేశారు. రైతుల మస్యలు తెలుసుకున్న అనంతరం వారి కలిసి భోజనం చేశారు. మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో వ్యవసాయం పండుగలా సాగుతుందన్నారు. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు.
తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. అన్నదాతను ఆదుకోవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌తోపాటు చరిత్రలో నిలిచిపోయే కాళేశ్వరంలాంటి ప్రాజెక్టు నిర్మాణంతో సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యం వచ్చేలా చేసిన సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతులంతా గులాబీ జెండాకు అండగా నిలవాలని కోరారు. ఈకార్యక్రమంలో తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.