Saturday, June 29, 2024

TS | రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలి.. ఏప్రిల్ 6న దీక్షలు చేస్తాం : కేసిఆర్

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఒకరోజు నిరసనకు పిలుపునిచ్చారు. కొత్త పంటకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతులకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. ఏప్రిల్‌ 2న బీఆర్‌ఎస్‌ నాయకులకు, అధికారులకు మెమోరాండం అందజేస్తామని.. ఏప్రిల్‌ 6న బోనస్‌ కోసం దీక్ష చేస్తామని.. ఈ ప్రభుత్వంపై ప్రజాస్వామ్యయుతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పాల‌న‌ చేతకాకపోతే దిగిపోవాల‌ని.. ఈ అసమర్థ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తామ‌ని స్పష్టం చేశారు.

రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రైతుల పక్షాన పోరాడేందుకు బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ ఉన్నారని హామీ ఇచ్చారు. సాగు నీరు లేక పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని ప్రజాస్వామయ్య పద్దతిలో ప్రభుత్వంపై యుద్ధం చేద్దామన్నారు కేసిఆర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement