కృషి పట్టుదల ఉంటె మనిషి ఏదైనా సాధించగలడు అని మరోసారి నిరూపించాడు ఓ రైతు. తన ఆత్మరక్షణ కోసం టెక్నాలజీని వాడుకొని సరికొత్త వాహనాన్ని సృష్టించాడు. దాడుల నుంచి రక్షణ పొందేందుకు తన ట్రాక్టర్ను బుల్లెట్ ప్రూఫ్గా మార్చాడు. హర్యానా, ఉత్తర్ప్రదేశ్ సరిహద్దుల్లోని ఓ గ్రామంలో ఈ రాజేంద్ర అనే రైతు నివసిస్తున్నాడు. ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాల కారణంగా ఘర్షణలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీంతో దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఆ రైతు కొత్తగా ఆలోచించాడు. తన ట్రాక్టర్ను బుల్లెట్ ప్రూఫ్గా మార్చాశాడు.
కొన్ని రోజుల క్రితం తన సోదరుడితో కలిసి పొలానికి వెళ్తున్నప్పుడు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని రైతు రాజేంద్ర తెలిపాడు. ఆ సమయంలో కాల్పులు కూడా జరిపారని, ఆ సమయంలో ఈ ట్రాక్టర్ కారణంగానే తాము సురక్షితంగా బయటపడ్డామని తెలిపాడు. ఆ ట్రాక్టర్ ను బుల్లెట్ ప్రూఫ్‌గా తీర్చిదిద్దడానికి రూ.5 లక్షల వరకు ఖర్చు చేశాడు.