Saturday, November 23, 2024

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ : రేవంత్ రెడ్డి

  • కాంగ్రెస్ ప్రభుత్వం లోని సబ్బండ వర్గాలకు చేయూత
  • హాత్ సే హాత్ జోడు యాత్రకు జన నీరాజనం
  • రైతు కూలీలతో టిపిసిసి రేవంత్ రెడ్డి మాటమతి

జనగామ : హాట్ సే హాత్ జోడు టిపిసిసి రేవంత్ రెడ్డి పాదయాత్ర జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం నుండి పాదయాత్రకు జన నీరాజనం పడుతూ రేవంత్ రెడ్డిని మంగళహారతులు ఇచ్చి, వీర తిలకంతో ఆహ్వానం పలికారు. ఈ పాదయాత్ర దేవరుప్పుల ధర్మపురం విసునూరు గ్రామాలలో కల్లుగీత కార్మికులను, గొల్ల కురుమలను కలిశారు. అదేవిధంగా గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ గురు సేవాలాల్ మహారాజ్ సీతల్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిపిసిసి అధినేత రేవంత్ రెడ్డితో పత్తి చేను కూలీలు తోరుకూరి సోమలింగమ్మ మాట్లాడుతూ.. పత్తికి గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోవడం జరుగుతుందని, కూలీలకే కూలులు ఇవ్వలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అన్నారు. ఒకనాడు గ్యాస్ ధర 400 రూపాయలు ఉన్న ఇప్పుడు రూ.1130 పెంచిందని రోజువారి కూలీ సైతం నిత్యావసర వస్తువులకే ధరల కొనుగోలుకి కూలి సరిపోతుందని అన్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడే ధరలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు సామాన్య ప్రజలను మోసం చేస్తూ.. తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ, పేదలకు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గింపు, వంటగ్యాస్ ధర 500 కి ఇవ్వడం, ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వ పరంగా ఐదు లక్షల రూపాయల అందించి ఇండ్ల నిర్మాణాలకు తోడ్పాటు అందించడం, కులవృత్తుల వారికి తోడ్పాటు అందించడం, గిరిజనుల ఆరాధ్య దైవం అయిన సేవాలాల్ జయంతి వేడుకలకు ప్రభుత్వం చేయూతను అందిస్తుందని అన్నారు. అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం కాంగ్రెస్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. వీరి వెంట పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతీ, టిపిసిసి సభ్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు నల్ల శ్రీరాములు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement