Monday, November 25, 2024

TS | త్వరలో రైతు, విద్యా కమీషన్లు ఏర్పాటు : సీఎం రేవంత్ రెడ్డి

ప్రజా సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు కమీషన్, ఎడ్యుకేషన్ కమిషన్ అనే రెండు కమీషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్న‌ట్టు.. త్వరలోనే ఈ రెండు కమీషన్లను ఏర్పాటు చేయాబోతున్నట్టు తెలిపారు.

పంటల బీమా పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కౌలు రైతుల రక్షణకు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తాం. అందరి సూచనలు, సలహాలు ఆధారంగా కౌలు రైతుల రక్షణకు చట్టం రూపొందించాలని యోచిస్తున్నట్లు సీఎం తెలిపారు.

విద్యావిధానం ఎలా ఉండాలో కమిషన్‌ నిర్ణయిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో ఏర్పాటు చేయనున్నట్టు ప్ర‌క‌టించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement