Tuesday, November 26, 2024

ఫామ్‌ హౌస్‌ డీల్స్‌ ఆడియో లీక్‌.. ఇంతకీ బీఎల్‌ సంతోష్‌ ఎవరు?

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. శుక్రవారం రామచంద్రభారతి(స్వామీజి) – పైలెట్‌ రోహిత్‌ రెడ్డి మధ్య ఫోన్‌ సంభాషణ ఆడియో లీక్‌ అయ్యింది. స్వామీజీ మాట్లాడుతూ.. ఎవరెవరు వస్తారో పేర్లు చెప్పాలని పైలెట్‌ రోహిత్‌ రెడ్డిని కోరారు. దీంతో రోహిత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సమావేశానికి హైదరాబాద్‌ మంచి ప్లేస్‌ అని.. మిగతా ప్రాంతాల్లో ఎలక్షన్‌ నిఘా ఉందని వివరించారు. నాతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీజేపీలో చేరే విషయమై నందకుమార్‌ ఈ ప్రపోజల్‌ తెచ్చారని స్వామీజితో అన్నారు. నందూను అడిగితే రేపు.. రేపు అంటున్నారని, కంగారు లేదని చెప్పానని రోహిత్‌ అన్నారు. నెంబర్‌ 2 ముందు ఆ లిస్ట్‌ బయటపెట్టగలరా? అని స్వామీజీ అడగారు.. నెంబర్‌ 1, నెంబర్‌ 2 ఆయనింటికే వస్తారు అని స్వామీజీ అన్నారు.

ఇంతకీ బీఎల్‌ సంతోష్‌ ఎవరు?
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీఎల్‌ సంతోష్‌ కీలక పాత్ర అని తెలుస్తోంది. అసలు ఈ బీఎల్‌ సంతోష్‌ ఎవరని సర్చ్‌ చేస్తే బీజేపీ జాతీయ కార్యదర్శిగా తెలుస్తోంది. ఈ డీల్‌ అంతటికి ఈయనే సూత్రదారి అని తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలను అహ్మదాబాద్‌కి తీసుకెళ్తాను అన్నారు. అక్కడ ఏ2తో కలిపించి మాట్లాడిపిస్తానని స్వామీజి రామచంద్రభారతి రోహిత్‌ రెడ్డితో అన్నారు.

వాస్తవంగా బీఎల్‌ సంతోష్‌ ఏ1, ఏ2 ఇంటికి వెళ్లడు.. బీఎల్‌ సంతోష్‌ ఇంటికే ఏ1, ఏ2 వస్తారని స్వామీజి అన్నారు. పార్టీ వ్యవహారాలు కాని, కేంద్రంలో మీరు నిర్వహించాల్సిన పాత్రల గురించి మొత్తం బీఎల్‌ సంతోష్‌ నిర్ణయిస్తారన్న విషయాలన్నీ స్వామీజి రోహిత్‌ రెడ్డికి చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చినట్లు ఈ ఆడియో లీక్‌ ద్వారా తెలుస్తోంది.

ఇప్పుడే ఎందుకు కొనుగోలు…
రాష్ట్ర ప్రజలంతా మునుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తుండడంతో.. మునుగోడులో గెలిస్తే రాష్ట్రంలో పార్టీకి బలం చేకూరుతుందనేది బీజేపీ అభిప్రాయం. ఈ సమయంలో టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితో మునుగోడులో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకత పెరిగి బీజేపీకి ఓట్లు పడే అవకాశం ఉందని బీజేపీ భావించింది. అందుచేతనే మునుగోడు ఎలెక్షన్‌కు ముందు అంటే 29వ తేదీన బీజేపీలో చేరేందుకు మీరు సిద్ధంగా ఉండాలని స్వామీజి పైలెట్‌ రోహిత్‌తో అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement