Saturday, November 23, 2024

ఫ్యాన్స్ కి షాక్..పెళ్ళి ఫొటోలు పోస్ట్ చేసిన నటి పూర్ణ

తన పెళ్ళికి సంబంధించిన ఫొటోలనే ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది నటి పూర్ణ. దుబాయ్ ఇండియన్ వ్యాపారవేత్త అయిన షానిద్ ఆసిఫ్ అలీ వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు తెలియజేసింది. తాజాగా తన పెళ్లి ఫోటోలను పంచుకుంటూ సర్ప్రైజ్ తో కూడిన షాక్ ను ఇచ్చింది. ఇక మే నెలలో పూర్ణ ఎంగేజ్మెంట్ జరగాక ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత తన కాబోయే వరుడుతో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అలా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ఇక నవంబర్ లో పూర్ణ వివాహం ఉంటుందనే వార్తలు బాగా వైరల్ గా మారాయి. ఇటీవల ఒక మీడియాతో స్పందించిన పూర్ణ జూన్ 12వ తారీకున తమ వివాహం జరిగిందంటూ ట్విస్ట్ ఇచ్చింది పూర్ణ.

కొన్ని కారణాల చేత తమ సన్నిహితుల బంధువుల మధ్య దుబాయిలో తమ వివాహం చాలా గ్రాండ్ గా జరిగిందని తెలియజేసింది. పూర్ణ పెళ్లి ఫోటోలు విషయానికి వస్తే పట్టుచీరలో నిండా నగలతో బుట్ట బొమ్మల కనిపిస్తోంది. పెళ్లికూతురు దుస్తులలో మరింత అందంగా కనిపిస్తోంది.తన చుట్టూ ఉన్న అమ్మాయిలకు అసూయ పుట్టేలా తన అందంతో పూర్ణ అక్కడ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక ముస్లిం సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగినట్లుగా ఈ ఫోటోలు చూస్తే మనకి అర్థమవుతోంది. ప్రస్తుతం పూర్ణ కు సంబంధించి ఈ పెళ్లి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement