Friday, November 22, 2024

అమర్త్యసేన్‌కు కరోనా.. కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేస్తున్న అభిమానులు

నోబెల్‌ విజేత, ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్యుల సలహా మేరకు ఆయన శాంతినికేతన్‌లోని సొంత ఇంట్లో స్వీయనిర్బంధంలో చికిత్స పొందుతున్నారు. జులై1న శాంతినికేతన్‌కు వచ్చిన ఆయన అసౌకర్యానికి గురైనారు. నలతతో బాధపడుతూంటడంతో వైద్యులను సంప్రదించారు.

ఆ తరవాత కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. నిజానికి శనివారంనాడు కోల్‌కతాలో జరిగే ఓ కార్యక్రమానికి హాజరైన తరువాత ఆదివారంనాడు లండన్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే, ఈలోగా కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అవడంతో ఆ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement