Saturday, November 23, 2024

మహారాష్ట్రలో కోరలు సాచిన కరవు..

న్యూఢిల్లి: మహారాష్ట్రలోని ఏడు జిల్లాల్లో మార్చి నుంచి మే వరకు ఒక్క చినుకు కూడా పడలేదు. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మే 31తో ముగియనున్న ఈ సీజన్‌లో మహారాష్ట్రలో 66 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దాదార్‌ నాగర్‌ హవేలీలో నూటికి నూరు శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ కాలంలో మహారాష్ట్రలో 28.2 మిల్లిdమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ… ఇప్పటివరకు ఇక్కడ 9.6 మిల్లి మీటర్ల వర్షం మాత్రమే కురిసింది. విదర్భ, మరఠ్వాడ ప్రాంతాలలోని జిల్లాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. దీంతో ఇక్కడ భూగర్బ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి.

2021తో పోల్చితే… ఈ ప్రాంతాలలో నీటి లభ్యత వరసగా 87 శాతం, 83 శాతం తక్కువ నమోదైంది. 2021తో పోల్చితే… మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, నాగాలాండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖాండ్‌లలో రిజర్వాయర్లలో నీటి స్థాయి చాలా తక్కువకు పడిపోయింది. మహారాష్ట్రలోని నందర్బార్‌, బీడ్‌, హింగోలి, జాల్నా, భంద్ర, బుల్దానా, వషీం జిల్లాలలో ఒక్క చుక్క వాన కూడా పడలేదు. వర్షాలకు అనుకూలమైన వాతావరణం లేకపోవడం వల్లనే ఇక్కడ వర్షాలు పడలేదని వాతావరణ శాఖ తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకినందున జూన్‌ నెలలో ఈ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు పడవచ్చునని తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement