Tuesday, November 26, 2024

హార్ట్ ఎటాక్ తో ఫేమస్ లిరిసిస్ట్.. నాసిర్ ఫరాజ్ క‌న్నుమూత‌

హార్ట్ ఎటాక్ తో క‌న్నుమూశారు బాలీవుడ్ ఫేమస్ లిరిసిస్ట్ నాసిర్ ఫరాజ్.ఆయన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. 86ఏళ్ల నాసిర్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.నాసిర్ ఫరాజ్ 2010లో హృతిక్ రోషన్ నటించిన ‘కైట్స్’ మూవీలో ‘దిల్ క్యున్ మేరా షోర్ కరే’, ‘జిందగీ దో పాల్ కీ’ అనే సూపర్ హిట్ పాటలను రాశారు. అలాగే ‘బాజీరావ్ మస్తానీ’, ‘క్రిష్’, ‘కాబిల్’ చిత్రాలకు పాటలు కూడా స్వరపరిచారు. నాసిర్ ఫరాజ్ ‘తుమ్ ముజే బస్ యున్ హై’, ‘మై హూన్ వో అస్మాన్’, ‘కోయి తుమ్సా నహీ’, ‘కాబిల్ హూన్’ ‘చోరీ చోరీ చుప్కే’ వంటి హృదయాలను హత్తుకునే పాటలను రాశారు, అతని అకాల మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. పలు బాలీవుడ్ చిత్రాలకు గేయాలు రాసిన నాసిర్ ఫరాజ్ కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఓ ఏడేళ్ల క్రితం ఆయనకు హార్ట్ సర్జరీ జరిగిందని సమాచారం. అప్పటి నుండి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆయనకు గుండెపోటు రావడం మరణానికి దారితీసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement