ప్రముఖ భరతనాట్య, కూచిపూడి కళాకారుడు అమర్‌నాథ్ ఘోష్ అమెరికాలో దారుణహత్యకు గురయ్యాడు. అమెరికాలో జరిగిన కాల్పులకు ఆయన బలయ్యాడు. ఈ విషయాన్ని టీవీ నటి దేవోలీనా భట్టాచార్జీ సోషల్ మీడియాలో తెలిపారు.
అమర్‌నాథ్ ఆమెకు స్నేహితుడు. అతని మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ప్రధాని నరేంద్ర మోదీలకు దేవోలీనా విజ్ఞప్తి చేశారు. అమర్‌నాథ్ మృతికి సంబంధించిన సమాచారాన్ని దేవోలీనా భట్టాచార్జీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అమర్‌నాథ్ కోల్‌కతాకు చెందినవారు. పీహెచ్‌డీ చేస్తూ, నృత్యంతో అద్భుతంగా రాణిస్తున్నారు. ఆయన ఈవినింగ్ వాక్ చేస్తుండగా, గుర్తు తెలియని దుండగులు అకస్మాత్తుగా ఆయనపై కాల్పులు జరిపారు. అమెరికాలోని అతని స్నేహితులు అమర్‌నాథ్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఇంకా పూర్తిస్థాయిలో అందలేదు. భారత రాయబార కార్యాలయం అమర్‌నాథ్ ఘోష్ హత్యకు గల కారణాన్ని తెలుసుకోవాలని’ ఆమె కోరారు.