ప్రముఖ కళాకారుడు, కళా సంపాదకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత జగదీష్ మిట్టల్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. భారతీయ కళలు, వారసత్వ సంపదను పరిరక్షించేందుకు, ప్రోత్సహించేందుకు జగదీష్ మిట్టల్ చేసిన కృషి ఎనలేనిదని ముఖ్యమంత్రి అన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించిన “జగదీష్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్” ద్వారా వారు అందించిన వారసత్వం తరతరాల కళాకారులు, కళాభిమానులు, చరిత్రకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. జగదీష్ మిట్టల్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు.