Friday, November 22, 2024

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

మేడ్చల్ మల్కాజ్‌గిరి: కీసర పోలీస్ స్టషన్ పరిధిలోని నాగరం మున్సిపాలిటీ వెస్ట్ గాంధీ నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతులు యాదాద్రి జిల్లా రాజపేట మండలం రేణిగుంట గ్రామానికి చెందిన భిక్షపతి, ఉష, యశ్వంత్, అక్షితగా గుర్తించారు.

కాగా ఈ ఘటనపై మృతుల బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ రోడ్డుపై భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మృతులను పోస్టుమార్టం నిమిత్థం ఆస్పత్రికి తరలించేందుకు తీసుకెళ్తున్న తరుణంలో బంధువులు రోడ్డుపైకి వచ్చి అంబులెన్సును అడ్డుకుని ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేయడంతో మృతుల బంధువులు వాగ్వాదానికి దిగారు. నిష్పక్ష పాతంగా విచారణ చేపట్టి ఆత్మహత్యలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నరేందర్ హామీ ఇవ్వడంతో మృతుల బంధువులు నిరసన విరమించుకున్నారు.

కాగా సీఐ నరేందర్ మీడియాతో మాట్లాడుతూ.. నలుగురు వ్యక్తులు ఒకే ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారని స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని చూడగా వలపు భిక్షపతి కుటుంభ సభ్యులతో ఉరేసుకుని మృతి చెందినట్లు గుర్తించి దర్యాప్తు చేపట్టామని, సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కూడా లభించిందని, నిజంగా మృతులే సూసైడ్ నోట్ రాశారా లేక ఎవరైనా వేధింపులకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారా, లేక హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఒకవేళ హత్య అని తేలితే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసులో తప్పకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement