Thursday, December 12, 2024

Family Function – జైపూర్‌లో రేవంత్ రెడ్డి – బంధువుల వేడుకలో పాల్గొననున్న సీఎం

ఎయిర్ పోర్టులో అక్క‌డి కాంగ్రెస్ నేత‌ల స్వాగ‌తం
రేపు ఢిల్లీకి.. అక్క‌డే రెండు రోజులు పాటు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, జైపూర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త‌న బంధువుల వివాహ వేడుక‌ల్లో పాల్గొనేందుకు బుధ‌వారం రాజస్థాన్ లోని జైపూర్ వెళ్లారు.. బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి విమానంలో త‌న కుటుంబంతో అక్క‌డికి చేరుకున్నారు.. ఎయిర్ పోర్ట్ లో రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్, సీఎల్పీ నేత తికారాం జల్లి, ఎమ్మెల్యే అమిత్ చరణ్, తదితరులు రేవంత్ కు స్వాగ‌తం ప‌లికారు.. నేడు , రేపు జైపూర్ లోనే ఉండ‌నున్నారు..

12, 13 తేదీల‌లో హ‌స్తిన‌లో..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైపూర్ నుంచి రేపు రాత్రి ఢిల్లీకి వెళ్ల‌నున్నారు.. ఆయ‌న‌ 12, 13 తేదీల్లో ఢిల్లీ పెద్దలను కలవనున్నారు. రెండ్రోజులపాటు దేశ రాజధానిలో పర్యటించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులపై కేంద్ర మంత్రులకు వినతులు ఇవ్వనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement