మన దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఫేమ్ సబ్సిడీని ఇస్తుండటంతో వీటి అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. మొత్తం ఈవీ అమ్మకాల్లో అత్యధిక భాగం ద్విచక్ర వాహనాలే ఉన్నాnయి. 2022-23లో మొదటిసారి మన దేశంలో ఈవీ వాహనాల అమ్మకాలు 10 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో 60 శాతం టూ వీలర్స్ అమ్మాకాలు ఉన్నాయి. 2021-22 సంవత్సరంతో పోల్చితే 2022-23లో ఈవీ వాహనాల అమ్మకాలు 183 శాతం పెరిగాయి. సబ్సిడీ మూలంగానే ఈవీ టూ వీలర్ల అమ్మకాలు భారీగా పెరగడానికి కారణంగా ఉంది. ప్రభుత్వం 2015 ఏప్రిల్‌లో ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యూఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎఫ్‌ఏఎంఈ-ఫేమ్) పేరుతో ఒక స్కీమ్‌ను నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ కింద ప్రారంభించింది.
దేశంలో సం ప్రదాయ ఇంధనంతో నడిచే వాహనాల స్థానంలో హైబ్రీడ్, విద్యుత్ వాహనాల ఉత్పత్తి, అమ్మకాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఫేమ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ కింద ఈవీ వాహనాల కొనుగోలపై సబ్సిడీని ప్రకటించింది. ఫేమ్ మొదటి దశ కార్యక్రమం 1019 వరకు నాలుగు సంవత్సరాల పాటు కొనసాగింది. ఫేమ్-2 స్కీమ్ 2024 మార్చి వరకు కొనసాగుతుంది. స్థానికంగా తయారవుతున్న ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌పై ప్రభుత్వం ఈ స్కీమ్ కింద 40 శాతం వరకు సబ్సిడీని ఇచ్చింది. బ్యాటరీ సామర్ధ్యాన్ని బట్టి సబ్సిడీని అందించేవారు.
దీంతో ఫేమ్ 2 సబ్సిడీ తగ్గించి వినియోగదారులకు కంపెనీలు వాహనాలను విక్రయించాయి. సబ్సిడీని ప్రభుత్వం నుంచి క్లైయిమ్ చేసుకునేవి. ఈ స్కీమ్ కింద టూ వీలర్సకు 15 వేల నుంచి 60 వేల వరకు సబ్సిడీ లభించేది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం విద్యుత్ టూ వీలర్స్‌కోసం ఇచ్చే సబ్సిడీని ప్రభుత్వం బడ్జెట్‌లో 2,000 కోట్ల నుంచి 3,500 కోట్లకు నిధులు పెంచింది. కాని సబ్సిడీని మాత్రం భారీగా తగ్గించింది. ప్రస్తుతం ఒక యూనిట్‌కు 40 శాతం వరకు ఇస్తున్న సబ్సిడీని 15 శాతానికి తగ్గించింది.
పరిశ్రమ ఆందోళన..
ఇలా ఒకే సారిభారీగా సబ్సిడీలో కోత విధించడం వల్ల దేశంలో ప్రారంభమైన ఈవీ రివల్యూషన్‌కు దెబ్బపడుతుందని పరిశ్రమ వర్గాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి. సబ్సిడీలు మరికొంతకాలం కొనసాగాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. సబ్సిడీ కోత విధించడానికి ఇది తగిన సమయం కాదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఒకేసారి ఇంత భారీగా సబ్సిడీలో కోత విధించడం వల్ల ఈవీ వాహనాల కొనుగులు భారీగా తగ్గిపోతుందని సొసైటీ ఆఫ్ మ్యాన్యూఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్‌ఎంఈవీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మొత్తం పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. వాస్తవానికి మనదేశంలో ఇంకా ధరల గురించి వినియోగదారులు ఎక్కువ ఆలోచిస్తారని, ప్రధాన కంపెనీల పెట్రోల్ టూ వీలర్స్ ధర 1 రూపాయల లోపుగానే ఉన్నాయని, సబ్సిడీపై ఈవీల రేట్లు పెరుగుతాయని ఎస్‌ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం మన దేశంలో ఈవీ వాహనాల అడాప్షన్ కేవలం 4.9 శాతంగా ఉందని, ఇది అంతర్జాతీయ బెంచ్ మార్క్ 20 శాతం చేరుకోవాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రస్తుతం దీని కంటే తక్కువగా ఉందని పేర్కొన్నారు. దేశంలో మొత్తం వాహనాల అమ్మకాల్లో విద్యుత్ వాహనాలు కేవలం 5 శాతం మాత్రమే. 2030 నాటికి ఈ సంఖ్య ప్రైవేట్ కార్లలో 30 శాతానికి, వాణిజ్య వాహనాల్లో 70 శాతానికి, టూ వీలర్స్‌లో 80 శాతానికి చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నాలుగు సంవత్సరాల్లో 10 లక్షల విద్యుత్ వాహనాల లక్ష్యాన్ని చేరుకున ్నందున టూ వీలర్స్‌పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేయాలని తొలుత ప్రభుత్వం భావించింది. పలు సూచనల తరువాత సబ్సిడీలో కోత విధించాలని నిర్ణయించింది. దీంతో పాటు విద్యుత్ వాహనాల ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్) స్కీమ్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో పాటు విద్యుత్ త్రీవీలర్స్, బస్సులకు సబ్సిడీని పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిదని ఒక సీనియర్ అధికారి తెలిపారు. 2024 ఫిబ్రవరి నాటికి మరో 10 లక్షల ఈవీ టూవీలర్స్‌కు సబ్సిడీ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాటరీ, ఇతర విడిభాగాల రేట్లు తగ్గిపోతున్నందన ఇక ముందు ఈవీ టూ వీలర్స్‌కు సబ్సిడీ అవసరం ఉండదని ఈ రంగంలోని కొంత మంది నిపుణులు అభిప్రాపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం 10 లక్షల వాహనాలకు సబ్సిడీ ఇచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు. ఉత్పత్తిని ప్రోత్సహించడం వల్ల ఎక్కువ మంది ఈవీలను కొనుగోలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక నుంచి టూ వీలర్స్ స్థానంలో బస్సులు, కమర్షియల్ వాహనాలు, కార్లకు సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.