Sunday, December 22, 2024

Allu Arjun | నాపై తప్పుడు ఆరోపణలు.. ఏ పార్టీని తప్పు పట్టలేదు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై హీరో అల్లు అర్జున్ స్పందించారు. థియేటర్ వద్ద తాను రోడ్డు షో చేయలేదని.. పర్మిషన్ లేకుండా థియేటర్ కి వెళ్లలేదని తెలిపారు. నిజంగా అనుమతి లేకుంటే తనను రోడ్డుపై నిలిపివేస్తే ఇంటికి వెళ్ళిపోయేవాడిని అని వివరించారు.

‘‘దాదాపు 20 ఏళ్ల నుంచి నేను ఆ థియేటర్ లో సినిమా చూస్తున్నాను. తన కోసం వేలాదిగా వచ్చి, గంటల తరబడి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం కారు బయటకు వచ్చి చేయి మాత్రమే చూపించానన్నారు.

అనంతరం సినిమా చూస్తుండగా కాసేపటికి మా మేనేజర్ వచ్చి క్రౌడ్ ఎక్కువగా ఉంది అని చెబితే అక్కడనుంచి వెళ్లిపోయాను. పోలీసులు తన వద్దకు రాలేదని, థియేటర్ నుంచి తనను వెళ్ళమని చెప్పలేదన్నారు.

- Advertisement -

తొక్కిసలాట, రేవతి మరణం గురించి తనకు మరుసటి రోజు తెలిసింది. ప్రస్తుతం శ్రీ తేజ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.. అది శుభవార్తే.

ఇందులో ఎవరి తప్పూ లేదు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. నాకూ శ్రీతేజ్ వయసు ఉన్న ఒక కొడుకు ఉన్నాడు. ఒక తండ్రిగా ఆ భాద నాకు తెలుసు. ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి వెళ్లాలనుకున్నా.. కాని అక్కడికి వెళ్లవద్దని పోలీసులు సూచించారు.

తెలుగు వారి పరువు కోసం సినిమాలు చేస్తుంటే… నన్ను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నా వ్యక్తిత్వానికి జరిగిన అవమానాన్ని భరించలేక‌పోతున్నా. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నేను ఏ పార్టీని తప్పుపట్టడం లేదు. నేను ఎవ్వరినీ దూషించుకోదలచుకోలేదు. అంతా మంచి జరగాలనుకుంటున్నాను.

సినిమాకు వచ్చే వారిని ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాను. సినిమా ఇంత పెద్ద హిట్టు అయినా… ఆ సక్సెస్ ను ఆస్వాదించలేకపోతున్నానన్నారు. 15 రోజులుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేకపోతున్నానని’’ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement