Saturday, November 23, 2024

ప‌డిపోతున్న రూపాయి.. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 79.06 పైసలు

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. బుధవారంతో పోలిస్తే రూపాయి విలువ 12 పైసలు తగ్గింది. బుధవారం రూపాయి విలువ 78.94గా ఉండగా గురువారం 79.6వద్ద స్థిరపడింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ మరోసారి వడ్డీరేట్లు పెంచుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడింది. రూపాయి విలువ పడిపోకుండా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటున్నట్లు బుధవారం ప్రకటించినప్పటికీ పెద్దగా ప్రభావం కన్పించలేదు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెంచేలా ఆర్‌బీఐ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. గురువారం మార్కెట్లు ప్రారంభమవగానే 78.90కు రూపాయి బలపడినప్పటికీ ఆ తరువాత 79.05కు పడిపోయింది. చివరకు 79.06వద్ద స్ధిరపడింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement