Thursday, November 7, 2024

కురుస్తున్న వానలు.. జోరందుకున్న వరి నాట్లు

మెదక్, (ప్రభన్యూస్‌) : వర్షాకాలం సహకరించడంతో పాటు అల్పపీడనద్రోణితో వర్షాలు పడడంతో వాగులు వంకలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. సామాన్యుడు వ్యవసాయం ప్రత్యేక చొరవ తీసుకొని సెంటు భూమి నుండి ఎరకాల వరకు వరినాట్లు వేసుకుంటే వ్యవసాయ సీజన్‌ జోరుగా జరుగుతుందని చెప్పాలి. వరినాట్లు వేయడంలో మహిళలు ప్రత్యేక పాత్ర అని చెప్పాలి. ఇప్పుడున్న సమయంలో టెక్నాలజీ కొత్తతరమైన వ్యవసాయ పద్దతులు చేపట్టినా చివరికి కూలీలతో వరినాట్లు వేయడంలో ఉన్నంత సంతోషం రైతుకు ఎక్కడా లేదని చెప్పాలి. చేతిన్లాతో లాభసాటి వ్యవసాయం జరుగుతుందని ఇప్పటికీ పెద్దపెద్ద భూస్వాములు సైతం కూలీలపై ఆధారపడి మహిళల కూలీలతో వరినట్లు వేయడం ప్రతి గ్రామంలో ప్రాధాన్యత సంతరించు కుంటుంది. ప్రతి సంవత్సరాన్ని బట్టి వ్యవసాయ శాఖక రైతులకు ఎలాంటి ట్రైనింగ్‌ ఇచ్చిన యాంత్రిక పద్దతులు ఉపయోగించి పంట రాబడి తక్కువ ఉంటుందని చాలామందికి అపనమ్మకం.

గ్రామాలలో వర్షాకాలం సీజన్‌లో వ్యవసాయ కూలీలు వరినాట్ల విషయాలలో మహిళలు జోష్‌గా పనిచేస్తారు. భూమి యజమాని నుండి ఎకరాకు గుత్తకాడికి మాట్లాడుకొని మూట సభ్యులుగా ఏర్పడి వరినాట్లు వేయడం సాగిస్తుంటారు. ఈ కాలం ఖరీఫ్‌ సీజన్‌లో వరినాట్లు మహిళలకు మంచి కూలీ రేట్లు పలకడంతో వారి మొహంలో సంతోషం వ్యక్తం అవుతుంది. సీజన్‌లో కొద్దిరోజుల పాటు జరిగే వ్యవసాయ వరినాట్లు మహిళలు ప్రత్యేక శ్రద్దతో నాట్లు సాగిస్తారని వ్యవసాయదారుల నమ్మకం. అలాగే జిల్లాలో మగవారు కూలీలుగా బిహార్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుండి జిల్లాలో చాలా మండలాల్లో నాట్లు చేయడానికి మగ పురుష కూలీలతో మన గ్రామాలలో మహిళా కూలీలు పోటీపడి వ్యవసాయ వరినాట్లు వేయడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement