దేశవ్యాప్తంగా 21 నకిలీ యూనివర్శీటీలు ఉన్నట్లు యూజీసీ ప్రకటించింది. ఆ యూనివర్శిటీలకు విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేసే అధికారం లేదని స్పష్టం చేసింది. దేశంలోనే అత్యధిక నకిలీ యూనివర్శిటీలు ఢిల్లిలో ఉన్నట్లు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దేశరాజధాని ఢిల్లిలో 8 నకిలీ యూనివర్శిటీలు ఉండగా, నాలుగు ఫేక్ యూనివర్శిటీలతో ఉత్తరప్రదేశ్ రెండోస్థానంలో ఉందని యూజీసీ తెలిపింది. యూజీసీ నిర్థారించిన 21 యూనివర్శిటీలకు విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేసే అధికారం లేదని, ఈ యూనివర్శిటీలు యూజీసీ యాక్ట్ 1956కు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించింది. పశ్చిమబెంగాల్‌లో రెండు, ఒడిషాలో రెండు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్కో నకిలీ యూనివర్శిటీ ఉందని యూజీసీ ఆ ప్రకటనలో వెల్లడించింది. కేంద్రం, రాష్ట్రం లేదా ప్రొవిన్షియల్ యాక్ట్ ద్వారా డీవ్డ్‌ు యూనివర్శిటీ హోదా పొందిన విద్యాసంస్థలను మాత్రమే యూనివర్శిటీలుగా గుర్తించడం జరుగుతుందని స్పష్టం చేసింది. స్వంతంగా నడుపుతున్నవి, గుర్తింపు లేని సంస్థలకు డిగ్రీ ప్రదానం చేసే అధికారం లేదని ప్రకటించింది.
లిండియా ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (ఏఐఐపిపిహెచ్‌ఎస్),ఆధ్యాత్మిక్ కమర్షియల్ యూనివర్శిటీ లిమిటెడ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్శిటీ, వొకేషనల్ యూనివర్శిటీ, ఏడీఆర్ – సెంట్రిక్ జ్యురిడికల్ యూనివర్శిటీ, ఇండియన్ ఇన్సిస్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, విశ్వకర్వ ఓపెన్ యూనివర్శిటీ, ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (స్పిర్చ్యువల్ యూనివర్శిటీ)లు ఢిల్లిలో నకిలీ యూనివర్శిటీలు. కర్నాటకలో బదగన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్శిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, కేరళలో సెయింట్ జాన్స్ యూనివర్శిటీ, క్రిష్ణపట్నం, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన రాజా అరబిక్ యూనివర్శిటీ, పుదుచ్చేరిలోని శ్రీబోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్‌లోని క్రిస్ట్ న్యూ టెస్టామెంట్ డీవ్డ్‌ు యూనివర్శిటీ. ఒడిషాలో నబభారత్ శిక్షాపరిషత్, నార్త్ ఒరిస్సా యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, పశ్చిమ బెంగాల్‌లో ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్‌లు నకిలీ యూనివర్శిటీలు. ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగకు చెందిన గాంధీ హిందీ విద్యాపీఠ్, కాన్పూర్ లోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్శిటీ, భారతీయశిక్షాపరిషత్, భారత్‌భవన్‌లు నకిలీ యూనివర్శిటీలని యూజీసీ ప్రకటించింది.