ప్రభన్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : నగరానికి చెందిన ఓ యువతి తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఫాస్ట్ కాయిన్ అనే లోన్ యాప్‌లో రూ.18 వేల రుణం తీసుకుంది. నెలరోజుల తర్వాత ఆమె రూ.25 వేలు చెల్లించింది. అయినా రుణ యాప్ సైట్‌లో ఆమె చెల్లించిన మొత్తం అప్‌డేట్ చేయకపోగా, మీరు రుణం చెల్లించలేదని, వెంటనే చెల్లించకుంటే మీ న్యూడ్ ఫొటోలు బంధువులకు పంపుతామని బెదిరించారు. తెల్లారేలోగా ఆమె మార్ఫింగ్ న్యూడ్‌ఫొటోలను బంధువులకు పంపించారు. దాంతో ఆమె భ యాందోళనకు గురై తీసుకున్న రూ.18 వేలకు గాను పలు దఫాల్లో రూ.2లక్షల వరకు చెల్లించారు. అయినా రుణ యాప్ వేధింపులు ఆగకపోవడంతో నార్సింగి పోలీసు స్టే షన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ సంఘటన మచ్చుకు మాత్రమే. గత మూడు, నాలుగు నెలలుగా ఇలాంటి సంఘటనలు అనేకం జరగుతున్నా పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. గతంలో కరోనా సమయంలో జరిగిన సంఘటనలు తిరిగి పునరావృతం కావడం ప ట్ల పోలీసులు సైతం ఆందోళన చెందుతున్నారు.
మెట్రోపాలిటన్ నగరాల్లోంచి ఆపరేటింగ్..
మెజార్టీ రుణ యాప్‌లు చైనాకు చెందినవేనని పోలీసులు అంటున్నారు. అయితే నిర్వాహకులంతా చైనాలో ఉంటూ మెట్రో పాలిటన్ నగరాలైన ఢిల్లీ, ముంబయి, బెంగళూర్, హైదరాబాద్ తదితర పట్టణాల నుంచి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. లోన్లు ఇవ్వడం నుంచి మొదలుకుని వసూలు వరకు కాల్ సెంటర్ల ద్వారానే ప్రధాన భూమిక పోషిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దేశంలో 1200కు పైగా రుణయాప్‌లు తమ కార్యకలాపాలను కొనసాగిస్తుండగా అందులో సగానికి పైగా అనుమతి లేనివని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి.
జాగ్రత్తలు పాటించాలి..
చట్ట విరుద్ధమైన రుణయాప్‌ల విషయంలో పోలీసులతో పాటు ఆర్‌బీఐ ఇప్పటికే పలుమార్లు హెచ్చ రికలు జారీ చేసింది. ఏదైనా రుణయాప్ నుంచి అప్పు తీసుకునే ముందు ఆ యాప్ గురించి పూర్తి సమాచారా న్ని సేకరించాలి. ఆర్‌బీఐ అనుమతి ఉందా లేదా అనే అంశాన్ని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి. పత్రాలు లేకుండా రుణాలు అందిస్తామనే యాప్‌ల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పు తీసుకున్న మొత్తానికి పది రేట్లకు పైగా వీరు రుణ గ్రహితలను అక్రమ మార్గాల్లో వసూలు చేస్తున్నారు. నగరంతో పాటు దేశ వ్యాప్తంగా ఇప్పటికే అనేక కేసులు కూడా నమోదయ్యాయి.
ధైర్యంగా ఫిర్యాదు చేయండి : పోలీసులు..
రుణయాప్‌ల వేధింపులపై బాదితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు పిలుపునిచ్చారు. కరోనా కాలంలో అనుమతిలేని అక్రమ రుణయాప్‌లు ప్రజలను వేధించాయని, వారి వేధింపులు భరించలేక అనేక మంది తనువు చాలించిన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రజలు ముందుకు రావాలని సూచించారు. బాధితుల సమాచారాన్ని గోప్యంగా ఉం చుతామని వెల్లడించారు. బాధితులు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..