Monday, November 25, 2024

National : అది ఫేక్ ఎన్ కౌంట‌ర్ … 13 మంది పోలీసుల‌కు జీవిత ఖైదు

18 ఏళ్లుగా కొనసాగుతున్న ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో తాజాగా ముంబై హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నవంబర్‌ 11, 2006 ఢిల్లీలో గ్యాంగ్‌ స్టర్‌ చోటా రాజన్‌ సన్నిహితుడు రామ్‌నారాయణ్‌ గుప్తాది ఫేక్‌ ఎన్‌కౌంటరేనని నిర్ధారించింది.

ఈ కేసులో మాజీ ఎన్‌ కౌంటర్‌ స్పెషలిస్ట్‌ ప్రదీప్‌ శర్మను జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ గౌరీ గాడ్సేలతో కూడిన ముంబై హైకోర్టు ధర్మాసనం దోషిగా తేల్చుతూ ఆయనకు జీవిత ఖైదు విధించింది.

- Advertisement -

2013లో ప్రదీప్‌ శర్మను నిర్దోషిగా ప్రకటిస్తూ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘శర్మ ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేసినట్లు లభ్యమైన సాక్ష్యాలను ట్రయల్ కోర్టు పట్టించుకోలేదు. సాధారణ సాక్ష్యాధారాలు సైతం ఈ ఫేక్‌ ఎన్‌కౌంటర్‌లో అతని ప్రమేయం ఎలాంటిదో నిస్సందేహంగా రుజువు చేస్తున్నాయి’ అని కోర్టు పేర్కొంది. అనంతరం, మూడు వారాల్లో సంబంధిత సెషన్స్ కోర్టులో లొంగిపోవాలని ధర్మాసనం శర్మతో ఈ కేసులోని దోషుల‌ను ఆదేశించింది. దీంతో పాటు 13 మంది పోలీస్ ల‌కు ట్రయల్ కోర్టు విధించిన నేరారోపణ, జీవిత ఖైదును హైకోర్టు సమర్థించింది. మరో ఆరుగురు నిందితుల నేరారోపణ, జీవిత ఖైదును రద్దు చేసి వారిని నిర్దోషులుగా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement