Saturday, November 23, 2024

పైసలిస్తే వ్యాక్సిన్‌, నెగెటివ్‌ రిపోర్టులు.. నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్‌..

కొవిడ్‌ విపత్కర కాలాన్ని అక్రమార్కులు తమ దందాకు అనువుగా మలుచుకున్నారు. ప్రజల అవసరాన్ని క్యాష్‌ చేసుకుంటున్నారు. నకిలీ ఆర్టీపీసీఆర్‌ రిపోర్టులు, తప్పుడు వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలను విక్రయిస్తున్న ముఠాను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. కొవిడ్‌ పరీక్షలు చేయించుకోకపోయినా నెగిటివ్‌ వచ్చినట్లు సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు తేలింది. పాతబస్తీలో నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ఈ ముఠాను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులకు నకిలీ సర్టిఫికెట్లు సరఫరా చేస్తోంది. అటు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం నకిలీ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లను కూడా విక్రయిస్తున్నారు.

మొత్తం నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి 50 ఫేక్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లు, 10 ఫేక్‌ ఆర్టీపీసీఆర్‌ రిపోర్టులు, రెండు సెల్‌ఫోన్స్‌ స్వాధీ నం చేసుకున్నట్లు సౌత్‌ జోన్‌ డీసీపీ చక్రవర్తి తెలిపారు. ఆసిఫ్‌నగర్‌లో తారీఫ్‌కు ఇమేజ్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రావెల్‌ ఏజెంట్‌ దగ్గర నుంచి వివరాలు తీసుకుని వారికి ఫేక్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తున్నారని తెలిపారు. వీరినుంచి మొత్తం 65 రిపోర్టులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న అందరినీ త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement