నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కరోనా మందు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉచితంగా పంపిణీ జరుగుతోంది. అయితే కొందరు అక్రమార్కులు తన కరోనా మందుకు నకిలీ మందు తయారుచేసి అమ్ముకుంటున్నట్లు ఆనందయ్య ఆరోపించారు.
తన పేరుతో కొందరు తయారు చేస్తున్న నకిలీ మందు వికటిస్తే దానికి తాను బాధ్యుడిని కానని ఆనందయ్య హెచ్చరించారు. నకిలీ మందుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తాను తయారు చేసిన కరోనా మందు అన్ని ప్రాంతాలకూ చేరిందన్నారు. తన కరోనా మందు పంపిణీకి సహకరించిన వారికి ఆనందయ్య కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో కొత్తగా 767 కరోనా కేసులు