Tuesday, November 26, 2024

TS | సర్కారు బడుల్లో ఫేషియల్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌… రాష్ట్ర వ్యాప్తంగా అమలు!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫేషియల్‌ రికగ్నషన్‌ అటెండెన్స్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌ఏ) విధానం అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్‌ రెండో వారం నుంచి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లోని దాదాపు 28 లక్షల మంది విద్యార్థులకు అమలు చేయనున్నారు. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీ పాఠశాలల్లో ఫేషియల్‌ రికగ్నషన్‌ అటెండెన్స్‌ తీసుకోనున్నారు. ఇక ఇది అందుబాటులోకి వస్తే విద్యార్థుల అటెండెన్స్‌ అంతా ఫేషియల్‌ రికగ్నషన్‌లోకి మారనుంది.

ముందస్తుగా మొదటి దశలో విద్యార్థులకు అమలు చేశాక, తర్వాత టీచర్లకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటికే దాదాపు 10 జిల్లాలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ అమలులో ఉన్నది. ఫేషియల్‌ రికగ్నషన్‌ అటెండెన్స్‌ విద్యార్థులకు విజయవంతంగా అమలు చేశాక, బయోమెట్రిక్‌ స్థానంలో ఉపాధ్యాయులకు సైతం షేషియల్‌ రికగ్నషన్‌ అటెండెన్స్‌ను అమలు చేయబోతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

అఇయతే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉండే అన్ని రకాల పాఠశాలల్లో ఫేస్‌ రికగ్నషన్‌ అటెండెన్స్‌ను అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు రిజిస్టర్లలో అటెండెన్స్‌ తీసుకునేవారు. కరోనా ముందు వరకు బయోమెట్రిక్‌ హాజరు అమలు చేశారు. ఆ తర్వాత జియో అటెండెన్స్‌ను అమలు చేసినా తర్వాత నిలిపివేశారు. మళ్లిdప్పుడు తాజాగా ఫేషియల్‌ రికగ్నషన్‌ అటెండెన్స్‌ అమలుకు అధికారులు చర్యలు చేపట్టారు.

- Advertisement -

ఈ విధానంపై ఇప్పటికే సర్కార్‌ కసరత్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. కీలమైన సాప్ట్‌ వేర్‌ టెండర్ల ప్రక్రియ ఇటీవల పూర్తి కావటంతో… పాఠశాలల్లో ఈ విధానం అమలుపై సర్కార్‌ మరింత ఫోకస్‌ పెట్టింది. రోజూవారి విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థుల హాజరు, అటెండెన్స్‌, లెర్నింగ్‌ యాక్టివిటీస్‌ లాంటివి ఫేసియల్‌ రికగ్నషన్‌ అటెండెన్స్‌ ద్వారా తెలిసేవీలుంటటోందని అధికారులు చెబుతున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే మరింత పారదర్శకత కోసం విద్యార్థులతోపాటు, టీచర్లు ఇతర సిబ్బంది కూడా దీని ద్వారనే హాజరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

గుజరాత్‌, ఢిల్లీ, నాగాలాండ్‌, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్ల్రో ఫేషియల్‌ రికగ్నిషన్‌ విధానం ఇప్పటికే అమలవుతున్నది. ఇదే క్రమంలో తెలంగాణ సర్కార్‌ కూడా ఆ దిశగా ఆలోచన చేసింది. పలు పాఠశాలలను ఎంచుకొని పైలెట్‌ ప్రాజెక్ట్‌ను కూడా అమలు చేసింది. మంచి ఫలితాలు ఉన్నందున రాష్ట్రమంతటా కూడా అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 18,818 స్కూళ్లకు 19,800 టాబ్స్‌ను విద్యాశాఖ అందజేసింది. టీచర్లకు పంపిణీ చేసిన ట్యాబ్‌లు, తమ స్మార్ట్‌ ఫోన్‌లలో యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి… కెమెరా ఆధారంగా స్కాన్‌ చేయగానే ముఖాలను గుర్తించి దానికదే హాజరు నమోదు చేస్తుంది.

ముందస్తుగా విద్యార్థుల ఫోటోలను అప్‌లోడ్‌ చేస్తారు. క్లాస్‌ ప్రారంభానికి ముందు ఒకసారి, మధ్యాహ్నం భోజనం సమయంలో మరోసారి రెండు సార్లు హాజరు నమోదు చేస్తారు. క్లాస్‌ టీచర్‌ స్మార్ట్‌ఫోన్‌/ట్యాబ్‌ కెమెరాను తెరిచి మొత్తాన్ని స్కాన్‌ చేయగానే ఎఫ్‌ఆర్‌ఎస్‌ అప్లికేషన్‌, కాగ్నిటివ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగించి, డాటాబేస్‌లో ముందే ఉంచిన చిత్రాలతో పోల్చుకుంటుంది. ఆయా ముఖాల ఆధారంగా క్లాసుకు ఎంత మంది హాజరయ్యారనే దానిపై లెక్క తేలుస్తుంది. రోజుకు ఎంత మంది హాజరవుతున్నారు. మధ్యాహ్న భోజనానికి ఎంత మంది ఉంటున్నారు. రోజూవారి హాజరు శాతం తక్కువగా ఉంటే వెంటనే ఉపాధ్యాయులకు అధికారులు అప్రమత్తం చేసి చర్యలు తీసుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement