Saturday, November 23, 2024

Face Book: ఫేస్‌బుక్ నుంచి కొత్త ఫీచర్

ఫేస్‌బుక్‌లో వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవాలంటే గతంలో ప్రత్యేకంగా మెసెంజ‌ర్ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకుంటే.. అప్పుడు దాంట్లో చాటింగ్, వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ ఆప్ష‌న్ ఉంటుంది. ఇకపై స‌ప‌రేట్‌గా మెసెంజ‌ర్ యాప్ లేకుండానే.. ఫేస్‌బుక్ మెయిన్ యాప్‌లోనే వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే ఫేస్‌బుక్.. ఇన్‌స్టాగ్రామ్‌తో మెసెంజ‌ర్‌ను లింక్ చేసింది. దీంతో ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ నుంచి కూడా ఇన్‌స్టాగ్రామ్ కాంటాక్ట్స్‌ను ఇంపోర్ట్ చేసుకొని.. చాట్ చేసుకునే వెసులుబాటు ఉంది. దాని కోసం స‌ప‌రేట్‌గా ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు.

ఇప్పుడు ఫేస్‌బుక్, మెసెంజ‌ర్ రెండు యాప్స్‌ను ఇంటిగ్రేట్ చేసే ప‌నిలో ఉంది ఫేస్‌బుక్. త్వ‌ర‌లోనే దానికి సంబంధించిన అప్‌డేట్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. దాంతో పాటు.. వాట్స‌ప్‌ను కూడా ఫేస్‌బుక్ మెయిన్ యాప్‌తో ఇంటిగ్రేట్ చేసే యోచ‌న‌లో ఫేస్‌బుక్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే.. మెసెంజ‌ర్‌కు సంబంధించిన అన్ని ఫీచ‌ర్స్ కావాలంటే మాత్రం తప్పనిసరిగా మెసెంజ‌ర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందేన‌ని ఫేస్‌బుక్ ప్ర‌తినిధి వెల్ల‌డించారు.

ఈ వార్త కూడా చదవండి: మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Advertisement

తాజా వార్తలు

Advertisement