Friday, January 3, 2025

TG | రేప‌టి నుంచి సచివాలయ ఉద్యోగులకు ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్..

ఉద్యోగుల సమయపాలనపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం ఫేస్‌ రికగ్నిషన్‌ హాజరు ప్రక్రియకు నిర్ణయించింది. దీంతో సచివాలయ ఉద్యోగులకు రేప‌టి (బుధవారం) నుంచి ఫేస్‌ రికగ్నిషన్‌ ద్వారా హాజరు నమోదు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.

సచివాలయంలో ప్రస్తుతం నాల్గో తరగతి ఉద్యోగుల నుంచి ఏఎస్‌ఓలు, సెక్షన్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ సెక్రటరీలు, డిప్యూటీ సెక్రటరీలు, జాయింట్‌ సెక్రటరీలు, అడిషనల్‌ సెక్రటరీల వరకు దాదాపు 4వేల మంది పని చేస్తున్నారు. ఐఏఎస్‌లు మినహా అందరికీ ఫేషియల్‌ రికగ్నిషన్‌ విధానాన్ని అమలు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement