Saturday, November 23, 2024

తాలిబ‌న్లకు ఫేస్ బుక్ కట్..

తాలిబన్లకు సంబంధించిన ఏ సమాచారానికి తమ వేదికలో స్థానం లేదని స్ప‌ష్టం చేసింది ఫేస్ బుక్. . తమ సేవలు వినియోగించుకునే అవకాశం లేకుండా తాలిబన్లపై నిషేధం విధించినట్టు ప్ర‌క‌టించింది ఎఫ్‌బీ.. ఇప్ప‌టికే తాలిబ‌న్ల‌కు సంబంధించిన ఖాతాల‌ను తొలగించిన‌ట్టు వెల్ల‌డించింది. తాలిబ‌న్ల మూమెంట్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, స‌మాచారం సోష‌ల్ మీడియాకు ఎక్కుతున్నాయి.. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అమెరికా ప్రభుత్వం తాలిబ‌న్ల‌ను ఉగ్రవాదులుగా పేర్కొన‌డంతో తాలిబన్లకు సంబంధించి ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. ఇక‌పై తాలిబన్లకు సంబంధించిన సమాచారంపై ఓ కన్నేసి ఉంచుతామ‌ని.. దానికోసం ప్రత్యేకంగా ఒక టీమ్‌ను కూడా ఏర్పాటు చేసిన‌ట్టు వెల్ల‌డించింది ఫేస్‌బుక్. ఆఫ్ఘానీ భాషలైన డారీ, పాష్తోలలో ప్రావీణ్యం ఉన్న స్థానికుల‌ను ఆ స్పెష‌ల్ టీమ్‌లో సభ్యులుగా చేర్చింది. స్థానిక పరిస్థితులపై లోతైన అవగాహన ఉన్న వీరు.. ఫేస్‌బుక్‌లో తాలిబన్లకు సంబంధించిన సమాచారం కోసం జల్లెడపడుతూ.. సంస్థను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటారు.. మొత్తంగా.. తాలిబ‌న్ల‌కు సంబంధించిన ఏ ఒక్క స‌మాచారాన్ని కూడా ఫేస్‌బుక్ వేదిక‌గా పంచుకునే వీలులేకుండా చ‌ర్య‌ల‌కు పూనుకుంది.

ఇది కూడా చదవండి: ఆఫ్ఘనిస్తాన్: ఒకే విమానంలో 640 మంది.. ఫోటో వైరల్

Advertisement

తాజా వార్తలు

Advertisement